నెల్లూరు జిల్లాకు ఆక్సిజెన్ జనరేటన్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు రియల్ హీరో సోనూసూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజల ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్. 1.5 కోట్ల విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ జనరేటర్ రోజూ 2 టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Real Hero Sonusood help to Nellore
Koduru Devanand
0
Post a Comment