ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు జూలైలో?

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ డిగ్రీ పరీక్షలు జూలైలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో, వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సమాయత్తమవుతోంది. పదిహేను రోజులు ముందుగానే షెడ్యూలు విడుదల చేయాల్సి  ఉంటుంది
 ఈ నెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది తర్వాత వైద్యశాఖ అధికారులతో చర్చించి పరీక్ష సమయం నిర్ణయించే అవకాశం ఉంది. మంగళవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు. అలాగే విద్యార్థులు ఆరోగ్యాన్ని మరియు తల్లిదండ్రుల ఆందోళనలు దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు చక్కబడ్డాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.

ఇంజనీరింగ్ పరీక్షలు
ఇంజనీరింగ్ పరీక్షలు కూడా జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది మొదటగా చివరి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు, పరీక్షలు రెండు పర్యాయాలుగా నిర్వహిస్తారు ,తద్వారా  క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్ అయిన విద్యార్థులు ముందుగా పరీక్షలు రాసి అవకాశం ఉంటుంది.జూలైలో పరీక్షలు పూర్తి అయితే సెప్టెంబర్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి పరీక్షలు జరుగుతాయి. డిగ్రీ పరీక్షలు కూడా ఇదేవిధంగా నిర్వహించాలని అని భావిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post