తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు
CBSE, ICSEఇప్పటికే 12వ తరగతి పరీక్షలు రద్దు చేయగా ,తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ద్ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని మరియు తల్లిదండ్రుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు .ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులు ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని ఇందుకోసం ఒక కమిటీని నియమిస్తున్నట్లు కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు.
Post a Comment