*DSC-2008: డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌: మంత్రి సురేశ్‌



*DSC-2008: డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌: మంత్రి సురేశ్‌*

*డీఎస్సీ-2008 బాధితులైన 2,190 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగ్​లు ఇవ్వాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వీరికోసం ప్రత్యేక రిక్రూట్​మెంట్ చేపడతామని తెలిపారు. మినిమమ్ టైమ్ స్కేల్లో పని చేయడానికి డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారని వివరించారు.*

 *2018 డీఎస్సీలో పోస్టుల భర్తీలో భాగంగా 486 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. 2018 డీఎస్సీకి సంబంధించి 387 పోస్టులు పెండింగ్​లో ఉంటాయని, వాటినీ త్వరలో భర్తీ చేస్తామన్నారు.*

*ఏపీ టెట్-2021 సిలబస్ సిద్ధం చేసి http://aptet.apcfss.in/ వెబ్​సైట్​లో పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.*


Post a Comment

Previous Post Next Post