AP Schools Dont open schools in that areas

Online classes ప్రత్యామ్నాయం మాత్రమేనని AP  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్కూల్స్, కాలేజీలు తెరిచాక కూడా online classes నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తాజాగా టీవీ9 ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పాఠశాలలలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి వాస్తవమేనని ఆయన తెలిపారు. 10 కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించవద్దని గతంలోనే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 
అలాగే పాఠశాలలు, కాలేజీల్లో ఫీజులకు సంబంధించి 53, 54 జీవోలను జారీ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.third wave భయంతో మరియు నిపుణుల హెచ్చరికల నేపథ్యం లో గంభీర వాతావరణం నెలకొంది.

Post a Comment

Previous Post Next Post